హైదరాబాద్లో భారీ వర్షం, ట్రాఫిక్ కష్టాలు
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన వర్షం దెబ్బకు రాజధాని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించిపోయింది. వర్షం దెబ్బకు విపరీతంగా… ట్రాఫిక్ జామ్తో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఓల్డ్ సిటీతోపాటు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, మైత్రివన ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరాతాబాద్, సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో వర్షం దెబ్బకి ప్రయాణీకులు ఇబ్బందులుపడ్డారు. పలు ప్రాంతాల్లో కిలో మీటర్ల మేర రోడ్లు జామ్ అయ్యాయి. హైదరాబాద్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
