మళ్లీ వణికిస్తున్న వాన ముప్పు
ఇప్పటికే కురిసిన భారీ నుండి అతి భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలతో లబోదిబోమంటున్నారు. రుతుపవనాలు సాధారణంగానే ఉన్నాయని… వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలాంగాణ మీదుగా ఏర్పడిన ఊపరితల ద్రోణి… ఏ సమయంలోనైనా బలపడే అవకాశం ఉందని తెలుస్తోంది. లోతట్టు , ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవిన్యూ శాఖ అలర్ట్ చేసింది. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలకు మళ్లీ వాన ముప్పు పొంచి ఉందన్న వార్తతో భయభ్రాంతులకు గురిచేస్తోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలోని ప్రజలు, కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాల కారణంగా పునరావాసాలు లోతట్టు లోనే ఉండగా… తాజాగా ఆదివారం కురుసిన వర్షం కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోడ్ల పైకి నీరు వచ్చి చేరడంతో… వాహనదారులు గమ్యస్ధానాలను చేరడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈ క్రమంలోనే కవాడిగూడ, భోలక్ పూర్, గాంధీ నగర్ , దోమలగూడ , ఆర్టీసీ క్రాస్‌రోడ్ , జవహర్‌నగర్, దిల్ సుఖ్ నగర్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాలతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు… రోడ్లపై నిలిచిన వర్షం నీటిని మళ్లించారు.