NewsNews AlertTelangana

జంట జలాశయాలకు భారీ వరద…భయం… భయం…

Share with

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.వారం రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల ఘటన మరిచిపోకముందే మళ్లీ వర్షాలు కురుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది

నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర,హిమాత్‌సాగర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.ఉస్మాన్ సాగర్ ఇన్‌ఫ్లో 2 వేల క్యూసెక్కులు కాగా….నాలుగు గేట్ల ద్వారా 832 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు.ఉస్మాన్ సాగర్ జలశయం పూర్తిస్ధాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా,ప్రస్తుతం 1786.65 అడుగులు వరకు నీరు చేరింది.
హిమయత్ సాగర్‌కు 500 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా..రెండు గేట్ల ద్వారా 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు.హిమాయత్‌సాగర్ జలశయం పూర్తిస్ధాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా,ప్రస్తుతం 1760.50 అడుగుల మేర వరద నీరు చేరింది.