News

అబార్షన్‌పై కోర్టు తీర్పు… అనేక సందేహాలు

Share with

ఆధునిక పోకడలకు ..నాగరికతలో మేము ముందు వరుసలో ఉన్నామనే అమెరికా వంటి దేశాలు అబార్షన్… గర్భ విచ్చితిని నిషేధిస్తూ చట్టాలు చేస్తూ ఉంటే మరి నైతిక విలువలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే మన దేశంలో ఇలాంటి తీర్పులు సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తాయ్ ?

ఒక అవివాహిత తాను దాల్చిన గర్భాన్ని తీసివేయలని సుప్రీంకోర్టు కు ఆశ్రయించింది. సుప్రీం కోర్ట్ తీర్పు ఇస్తూ ఆ మహిళకు ఆర్టికల్ 21 కింద స్వేచ్ఛ గా జీవించే హక్కుకు భంగం కలగకూడదని స్పష్టం చేసింది. మరి వివాహం కాక మునుపు గర్భం దాల్చడం ఎటువంటి స్వేచ్ఛనో కోర్టు విశ్లేషణ చేయాల్సిoది. మెడికల్ టెర్మినేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2021 చట్టంలో కొంత మంది మహిళలకు గర్భవిచ్చితి చేసుకోవడానికి చట్టం అనుమతించింది. అత్యాచారం చేయబడ్డ మహిళలు… వావి వరసలు లేకుండా గర్భం దాల్చిన మహిళలు, అభాగ్యులు, మైనర్లు, దివ్యాంగులు…. గర్భం వల్ల తల్లి ప్రాణాలకు అపాయంగా ఉంటే… ఆ గర్భంలో పిండం లోపాలతో ఉంటే అది కూడా 20 వారాల లోపు మాత్రమే గర్భ విచ్చితికి చట్ట పరమైన అనుమతి ఉందని పేర్కొంది.

మరి ఒక అవివాహిత మహిళ గర్భం దాల్చినప్పుడు… సదరు వ్యక్తి జీవించే హక్కును ఆలోచిస్తున్న కోర్టు… గర్భంలో ఉన్న పిండం గురుంచి ఎందుకు ఆలోచించడం లేదు? మహిళల కోసం దేశంలోని పునరుత్పత్తి హక్కులలో సానుకూల మార్పులు ఉన్నప్పటికీ, గర్భస్రావం ఎల్లప్పుడూ నైతిక, రాజకీయ మరియు చట్టపరమైన వివాదాలకు దారితీసింది. అబార్షన్ అనేది చాలా గొప్ప సైద్ధాంతిక సంఘర్షణకు మూలకారణం. కుటుంబం, రాష్ట్రం, మాతృత్వం, స్త్రీల లైంగికత ప్రాథమిక అర్థాలు అనేక సంక్లిష్టతలకు కారణమవుతాయ్. కేవలం వైద్య-సాంకేతిక సమస్య కాదు….దేశంలో ఉన్న మతాలు… గర్భ విచ్చితిని ఆమోదించజాలవు. మరి నైతికతకు… చట్టానికి మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు… తీర్పులు ఇలానే ఉంటాయి.

Dr G అజ్మతుల్లా ఖాన్
మదనపల్లె