శవాల మధ్య సినిమా చూశాడు
అల్లు అర్జున్ అరెస్ట్ పై తనను సోషల్ మీడియా వేదిక గా టార్గెట్ చేసిన వారందరినీ … అసెంబ్లీ సాక్షిగా సీఎం అనుముల రేవంత్ రెడ్డి చీల్చిచెండాడారు. ఇద్దరు ప్రాణాలు పోయాయని చెప్పినా సినిమా ఆసాంతం చూస్తానన్నారని ఇంత దారుణమైన మనస్తత్వం ఎవరికైనా ఉంటుందా అధ్యక్షా అంటూ నిర్వేదం చెందారు.సంధ్య థియేటర్‌కి కి సరైన సదుపాయాలు లేవని తెలిసే తమ పోలీసులు అనుమతి నిరాకరించారన్నారు.అయినా ఆ హీరో వచ్చి అభివాదం చేసుకుంటూ థియేటర్ లోపలికి వెళ్ళారని ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనేమహిళ చనిపోయిందని,ఆమె కొడుకు కూడా చనిపోయాడని తొలుత భావించామని అయితే బ్రెయిన్ డెడ్( జీవచ్చవం) వల్ల స్పృహ కోల్పోయాడని తెలిశాక ఎలాగైనా ఆ ప్రాణాన్ని బతికించాలనుకున్నాం.కానీ మనిషి చనిపోయిందని తెలిశాక కూడా అల్లు అర్జున్ సినిమా చూస్తా అంటూ అక్కడే కూర్చున్నాడని చెప్పారు.కొద్ది సేపటికి మా డిసిపి వచ్చి ఇక్కడ నుంచి వెళ్లకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారని,అలా వెళ్లిపోతూ కూడా రూఫ్ టాఫ్ నుంచి మళ్లీ అభివాదం చేశారని,మనిషనే వాడు ఎవడైనా ఇలా చేస్తాడా అధ్యక్షా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

