మాట ఇచ్చాడు చేసి చూపించాడు
గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు నెల్లూరులో అరుదైన గౌరవం దక్కింది. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ఘన నివాళి అందించారు. నెల్లూరులోని ఆదిత్య నగర్ కార్పోరేషన్ పార్క్‌కు ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరు పెట్టాలని ఎమ్మెల్యే అనిల్ అధికారులను ఆదేశించారు.

ఈ ఆదేశాల మేరకు పనులు ప్రారంభించిన అధికారులు అక్కడ బాల సుబ్రమణ్యం విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఈ రేజు ఎమ్మెల్యే అనిల్ ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరులో జన్మించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప కళాకారుడికి ఇది ఒక గౌరవమన్నారు. నెల్లూరు నగర వాసులకు కలకాలం గుర్తుండేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. దీంతో నెల్లూరు ప్రజలంతా ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

