Home Page SliderNational

మృతదేహాన్నిచితిపై పెట్టగానే కళ్లు తెరిచాడు..

రాజస్థాన్ లోని జున్జున్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చనిపోయాడని ప్రకటించిన డాక్టర్లు.. వ్యక్తి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని చితిపై పెట్టగానే కళ్లు తెరిచి అందరికీ షాక్ ఇచ్చాడు. మళ్లీ కొన్ని గంటలకే మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 25 ఏళ్ల చెవిటి, మూగ వ్యక్తి కుమార్ ఆరోగ్యం క్షీణించడంతో జున్జున్ బీడీకే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కుమార్ చికిత్సకు స్పందించకపోవడంతో అతను చనిపోయినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. డెడ్ బాడీని శ్మశానవాటికకు తరలించారు. మృతదేహాన్ని చితిపై ఉంచిన సమయంలో కుమార్ ఒక్కసారి కళ్లు తెరిచి శ్వాస తీసుకున్నాడు. ఇది గమనించిన వ్యక్తులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరి.. చికిత్స తీసుకుంటున్న కొన్ని గంటలకే ఆ యువకుడు మళ్లీ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణలో వైద్యుల నిర్లక్ష్యాన్ని గుర్తించారు. డాక్టర్ యోగేశ్ జాఖర్, డాక్టర్ నవనీత్ మీల్, పీఎంవో డాక్టర్ సందీప్ లను సస్పెండ్ చేశారు.