పరువు కోసం కూతుర్ని చంపేశాడు
అనంతపురం జిల్లాలో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది.కులాంతర ప్రేమాయణం నడుపుతుందనే నెపంతో కన్న కూతుర్నే చెట్టుకు ఉరేసి చంపేశాడు.అంతటి ఆగకుండా పెట్రోల్ పోసి నిప్పంటించి కూతురు శవాన్ని బూడిద గా మార్చే దుస్సాహసం చేశాడు.ఈ ఘటన గుంతకల్లులో తీవ్ర భయత్పాతాన్ని సృష్టించింది.అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన రామాంజనేయులుకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న చిన్న కూతురు భారతి (21) హైదారాబాద్ లో ఓ యువకుణ్ణి ప్రేమించింది .అతను వేరే కులానికి చెందిన వాడని, మరిచిపోవాలని తండ్రి మందలించినా కూతురు వినలేదు.ఈ నెల ఒకటో తేదీన తన కూతురుని బండిపై ఎక్కించుకొని గుంతకల్లు మండలం కసాపురానికి తీసుకెళ్ళి మరొకసారి మందలించనా కూతురు పట్టించుకోలేదు.దీంతో బలవంతంగా చెట్టుకి ఉరి వేసి చనిపోయాక తన బండి నుండి పెట్రోల్ తీసి ఆమెపై పోసి నిప్పంటించి తగలబెట్టాడు.దాదాపు 80శాతం కాలిపోయింది.పోలీసుల ఎదుట లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు.నిందితుణ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.

