ఆ `కారు` గేటును చూశారా?
జీవితంలో ప్రతి ఒక్కరూ డిఫరెంట్ స్టయిల్‌లో ఉండాలనుకుంటారు.. కొందరికి కొన్ని వస్తువులపై అపురూపమైన ప్రేమ ఉంటుంది. ఓ వ్యక్తికి కారు అంటే మమకారం. అందుకు ఆ వ్యక్తి కారు రూపంలో ఇంటికి వినూత్నంగా గేటును ఏర్పాటు చేసుకున్నాడు. అది ఓ ఇంటి ముందున్న ప్రహరీ గేటు. కానీ, బాగా పరిశీలించి చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. లేదంటే దాన్ని కారుగానే పొరబాటు పడతాం. ఎందుకంటే కారు మాదిరే అటూ ఇటూ కదులుతుంది. కారు మాదిరే డోర్లు, విండోలు కనిపిస్తాయి. అయితే.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాకు ఈ కారు వీడియో తెగ నచ్చేసింది. ఆయన ఈ అరుదైన విశేషాలను షేర్ చేయడంలో ముందుంటారు. ఈ వీడియోను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. వీడియోను చూడగానే మహీంద్రాకు అనేక డౌట్లు వచ్చాయట.
1.కారు అంటే ఎంతో అభిరుచి కలిగిన వ్యక్తి? 2. ఎవరూ తన ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించకూడదనుకునే అంతర్ముఖుడు? 3. చమత్కారంతో కూడిన హాస్యం కలిగిన వ్యక్తి? 4. పై వన్నీ కూడా?
ఈ ఆప్షన్లలో ఏది అతడికి సరిపోతుందో.. కామెంట్లు రూపంలో చెప్పమని కోరినట్టుగా ఆనంద్ మహీంద్రా ఆప్షన్లతో పోస్ట్ పెట్టారు. నెటిజన్లు ఉత్సాహంగా తమ అభిప్రాయలను తెలియజేస్తున్నారు. కొత్త ఐడియా అంటూ మెచ్చుకుంటున్నారు.

