మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తున్న ఫన్నీ వీడియో
ఇంటర్నెట్ ప్రపంచంలో ఇంట్రెస్టింగ్ వీడియోలో మనందరికీ చాలా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా కప్పల వీడియో ఒకటి 13 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ట్విట్టర్‌లో దూసుకెళ్తోంది. ఈ వీడియోలో ఒక కప్ప నీళ్ళలో బాటిల్ మూతపై కూర్చొని ఉంటుంది. అది నీటిపై తేలియాడుతుంటే మరో కప్ప ఆ మూతపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. తన ప్రయత్నంలో మళ్లీ నీళ్లలో పడిపోతుంది. అలా మూతపైకి రావడానికి ప్రయత్నించినా మళ్లీ నీళ్లలో పడి విఫలమవుతుంది. 11 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.