విడాకుల తర్వాతే సంతోషకరమైన జీవితం..మిలిందా గేట్స్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌తో విడాకులు తీసుకున్న అనంతరమే తన జీవితం సంతోషంగా, ప్రశాంతంగా ఉందని అతని మాజీ భార్య మిలిందా గేట్స్ వ్యాఖ్యానించారు. 2021లో విడాకుల అనంతరం తమ డైవోర్స్‌పై బహిరంగంగా ఆమె స్పందించారు. తన జీవితంలో పిల్లల సంరక్షణ, గేట్స్ ఫౌండేషన్ ఈ రెండే కీలక పాత్రలు పోషించాయని, విడాకులు తీసుకునే ముందు ఈ రెండిటి గురించే ఎక్కువగా ఆలోచించానని పేర్కొన్నారు. విడాకుల అనంతరం ఆమె స్వయంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. అనేక ఇతర ఫౌండేషన్ల ద్వారా దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. మహిళల హక్కులు, వారికి ఆర్థిక స్వావలంబన కోసం ఇటీవల బిలియన్ డాలర్ల ఫండ్స్ ప్రకటించారు. తాను ఇప్పుడు తన పనులు తానే స్వయంగా చేసుకుంటున్నానని, ఇది తనకు సంతోషంగా ఉందన్నారు. 1994లో వివాహం జరిగిన వీరికి ఇప్పుడు 20 ఏళ్లకు పైబడిన ముగ్గురు పిల్లలు ఉన్నారు. రకరకాల కారణాలతో వీరు 2021లో విడాకులు తీసుకున్నారు.

