గుజరాత్‌లో డిసెంబర్ 1, 5న పోలింగ్, 8న ఫలితాలు
గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రెండు విడతలగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. డిసెంబర్ 1, 5న రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడవుతాయి. యువతను పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనేలే చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు సీఈసీ రాజీవ్ కుమార్. గుజరాత్ లో మొత్తం 182 స్థానాలుండగా.. మెజార్టీ మార్క్ 92. గుజరాత్‌లోని 182 స్థానాల్లో 13 ఎస్సీలకు, 12 ఎస్టీలకు రిజర్వ్ చేశారు. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 62 స్థానాల్లో గెలుపొందింది. ఈసారి ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీ చీల్చే ఓట్లతో బీజేపీ మరోసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాశంగా విజయం సాధిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

4, 61,494 కొత్త ఓటర్లు ఈసారి ఎన్నికల్లో పాల్గొననున్నారు. 51,782 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తారు. గుజారాత్ లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను ఆప్‌కు కోల్పోతుందన్న ప్రచారం ఉంది. మోర్బీ దుర్ఘటన తర్వాత గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పట్టున్న పార్టీ మాత్రమే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశముందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈసారి గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధిస్తే సీఎంగా భూపేంద్ర పటేల్‌ను నియమించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గుజరాత్ లో ఇప్పటి వరకు ద్విముఖ పోటీ జరిగేది. కానీ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తోండటంతో.. ముక్కోణపు పోటీ ఖాయంగా కన్పిస్తోంది.

