చేయని వ్యాపారానికి కూలీకి రూ.23 లక్షల జీఎస్టీ మోత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలానికి చెందిన నిరుపేద కూలీ వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి జీఎస్టీ కర్యాలయం నుండి షాక్ తగిలింది. ఏకంగా రూ.22.86 లక్షల జీఎస్టీ బకాయిలు ఉన్నాయని, చెల్లించాలని విజయవాడ కమర్షియల్ టాక్స్ నుండి నోటీసు వచ్చింది. 2022లో భాగ్యలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ అనే పేరుతో రూ.1 కోటి మేర గ్రానైట్ వ్యాపారం చేశారని దానికి జీఎస్టీ చెల్లించలేదని ఆ నోటీసు సారాంశం. అయితే ఈ అడ్రస్‌కు వెళ్లగా అక్కడి అలాంటి కార్యాలయమే లేదు. తనకు తెలియకుండానే వ్యాపార లైసెన్స్ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాడు. తనకు పాన్ కార్డు కూడా లేదని పేర్కొన్నారు. ఆరు నెలల క్రితమే పాన్ కార్డుకు దరకాస్తు చేసుకున్నానని, తనకు తెలియకుండా ఎవరో తన ఆధార్‌కార్డు నెంబరు ద్వారా పాన్‌కార్డు పొంది ఉంటారని పేర్కొన్నారు. దీనితో అతడు అయోమయానికి లోనయ్యాడు.

