ఏపీలో గ్రూప్-4 మెయిన్స్ ప్రాథమిక కీ విడుదల
ఏపీలో గ్రూప్-4 మెయిన్స్ ప్రాథమిక కీ తాజాగా విడుదలైంది. కాగా రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 640 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను గత ఏడాది నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా వీటికి ఏప్రిల్ 4న మెయిన్ పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే గ్రూప్-4 ప్రాథమిక కీని APPSC అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల7 నుంచి 9 వ తేదిలోపు తెలియజేయాలని APPSC సూచించింది.

