Home Page SliderTelangana

నిమ్స్‌లో 22 నుండి చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేస్తున్న యూకే టీమ్

Share with

హార్ట్ డిసీజ్‌లు ఉన్న చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్‌లో ఉచితంగా వైద్య సేవలందించేందుకు యూకే వైద్య బృందం హాస్పిటల్‌కు విజిట్ చేయనున్నదని డైరెక్టర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప తెలిపారు. యూకేలో స్థిరపడ్డ డాక్టర్‌ రమణ దన్నపనేని ఆధ్వర్యంలో ప్రతి ఏటా వారం రోజుల పాటు నిమ్స్‌ పార్ట్‌నర్‌షిప్‌తో గుండెకు సంబంధించిన సమస్యలున్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ నెల 22 నుండి 28 తేదీల్లో యూకే నుండి వచ్చిన డాక్టర్‌ రమణ నేతృత్వంలో ఫిల్‌ ఆర్నాల్డ్‌, గీతా, ఆనంద్‌ వాఘ్‌, నాగకిషోర్‌, బ్రాస్‌ అటాండి, నిమ్స్‌ హాస్పిటల్ కార్డియోథోరాసిక్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ అమరేశ్వరరావు, సీనియర్‌ డాక్టర్లు గోపాల్‌, వైద్య సిబ్బందితో కలిసి ఈ ఆపరేషన్లు నిర్వహిస్తారన్నారు. గుండె సమస్యలున్న పిల్లలు నిమ్స్‌ కార్డియోథోరాసిక్‌ విభాగం డాక్టర్లను సంప్రదించాలని డైరెక్టర్‌ సూచించారు.