కేంద్రానికి తెలంగాణ గవర్నర్ ఫిర్యాదు
తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ లేఖపై ఆమె మండిపడ్డారు. మొత్తం వ్యవహారాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని గవర్నర్ నిర్ణయించారు. పరేడ్ గ్రౌండ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు జరపకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కరోనా అంటూ వేడుకలు జరపడం లేదని చెప్పడం సరికాదన్నారు. మొత్తం వ్యవహారాన్ని ఢిల్లీ పెద్దలకు వివరించాలన్న ఆలోచనలో ఆమె ఉన్నారు. ప్రభుత్వ తీరుతో రాజ్ భవన్‌లోనే గవర్నర్ జాతీయ పతకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సొంత ఖర్చులతో పుదుచ్చేరికి వెళ్లి అక్కడ జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొంటారని తెలుస్తోంది.
