వాహనదారులు అలెర్ట్… బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
మన సర్కార్ న్యూస్ : పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 4న బంజారాహిల్స్ రోడ్ నెం. 12 లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటన రీలీజ్ చేశారు. ఎన్టీఆర్ భవన్ నుంచి అపోలో ఆస్పత్రి, ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్ మీదుగా వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి రోడ్డు నంబర్–36, 45 మీదుగా మాదాపూర్ వైపునకు మళ్లాలి. మాసబ్‌ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12 వైపు వచ్చే వాహనాలు బంజారాహిల్స్ రోడ్డు నంబర్–1, 10 మీదుగా జహీరానగర్, కేన్సర్ ఆస్పత్రి మీదుగా వెళ్లాలి.
ఫిల్మ్‌నగర్ మీదుగా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్‌ఎన్‌టీ, ఎన్‌ఎఫ్‌సీఎల్ మీదుగా పంజగుట్ట వైపు వెళ్లాలి. మాసబ్‌ట్యాంక్ మీదుగా రోడ్డు నంబర్ 12, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనదారులు మెహిదీపట్నం, నానల్‌నగర్, టోలిచౌకి, ఫిల్మ్‌నగర్, జూబ్లిహిల్స్‌కు చేరుకోవాలి. ఈ నెల 4న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని మంత్రి తలసానితోపాటు హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్,మాగంటి గోపీనాథ్, సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి పరిశీలించారు.