చంద్రబాబు భద్రత పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే: హోం మంత్రి తానేటి వనిత
రాజమండ్రి జైలులో చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పించామని, చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఏపీ హోంమంత్రి అన్నారు. ఆధారాలు దొరికితే లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కోసం చట్టాలు, జైళ్లు చేయలేదని, జైళ్లలో అన్ని రకాల నేరస్తులు ఉన్నారని అభిప్రాయపడ్డారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పించామని, చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, లోకేష్, పవన్, బాలకృష్ణ ఎవరి పని వారు చేసుకోవాలని వనిత హితవు పలికారు.


