ఏపీలో ఇళ్ల నిర్మాణం చేపట్టేవారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఏపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టే మధ్య,దిగువ మధ్య తరగతి వారికి శుభవార్త చెప్పింది. కాగా వీరి కోసం గృహనిర్మాణ శాఖ ద్వారా ప్రత్యేకంగా ఒక పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ పథకానికి అర్హులను గుర్తించాలని సీఎం మంత్రులకు సూచించారు. కాగా వారికి కేంద్రం అమలు చేస్తున్న పథకాలతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం మంత్రులకు ఆదేశించారు. మరోవైపు వైసీపీ హయాంలో ఇళ్లు మంజూరై కోర్టు వివాదాల కారణంగా నిర్మించుకోని వారికి కూడా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-2 కింద అవకాశం కల్పించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

