శివుడు గోపికగా దర్శనమిచ్చే గోపీశ్వరాలయం
బృందావనం : శివుడిని సాధారణంగా లింగరూపంలో పూజిస్తాం. కొన్ని ప్రత్యేక దేవాలయాలలో విగ్రహరూపంలో చూడవచ్చు. కానీ బృందావనంలోని ‘బడే కుంజ్’ లో గల ‘గోపీశ్వర ఆలయం’ లో శివుడు శ్రీకృష్ణుని ఆరాధించే స్త్రీ వేష ధారియై గోపికలా దర్శనమిస్తూ వుంటాడు. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది.
ఒకసారి బృందావనంలో గోపికలతో కలిసి శ్రీకృష్ణుడు ఆడిపాడుతూ వుండటం శివుడు చూస్తాడు. తాను కూడా ఒక గోపికలా మారిపోయి కృష్ణుడితో కలిసి ఆడాలని ముచ్చటపడతాడు. అందమైన గోపికగా వేషం కట్టి అక్కడి గోపికలతో కలిసిపోయి కృష్ణుడితో కలిసి నాట్యమాడసాగాడు. ఆ గోపికను చూసి తమకన్నా అందంగా వున్న కొత్త గోపిక ఎవరా అని మిగతా గోపికలు ఆశ్చర్యపోతారు. ఆమె నాట్యం చూసి అసూయపడతారు. ఆ సమయంలోనే ఆయన మేలిముసుగు జారిపోవడంతో వచ్చినది శివుడనే విషయం అందరికీ తెలిసిపోతుంది. దాంతో ఆయన అక్కడే ఆవిర్భవించడం జరిగింది. భర్త కోసం బృందావనానికి చేరుకున్న పార్వతి దేవి గర్భగుడి బయట భర్త కోసం వేచి ఉన్న పార్వతీదేవి.. అని ఆలోచిస్తూ పార్వతి దేవి తలుపు బయట కూర్చుని.. శివుడిని బయటకు రమ్మనమని సైగలు చేసింది. అయితే శివుడు అక్కడ లింగరూపంలో ఆవిర్భవించడంతో పార్వతి కూడా ఆయన కోసం ఎదురుచూస్తూ అక్కడే వెలసింది. ఆ రోజు నుంచి అపురూపమైన ఈ సంఘటనకి గుర్తుగా ఇప్పటికీ ప్రతిరోజు రాత్రి వేళలో శివుడిని స్త్రీగా అలంకరించి పూజిస్తూ వుంటారు. మహాదేవుడి ముచ్చట తీరుస్తూ మురిసిపోతుంటారు . ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ శివాలయంలోని గర్భగుడిలో శివయ్య ఉండగా పార్వతి దేవి అతనికి ఎదురుగా అంటే శివాలయం తలుపు దగ్గర శివయ్య కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

