ఈ ప్రయోజనాల కోసం ఉదయం త్వరగా లేవండి…
సాధారణంగా కొంత మంది రాత్రి ఆలస్యం అవ్వడం వల్లనో లేక బద్దకం వల్లనో ఉదయం పూట ఆలస్యంగా లేస్తుంటారు. కాని ఉదయాన్నే లేవడం వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు.
మనం త్వరగా మేల్కొన్నప్పుడు శరీరం యొక్క సిర్కాడియన్ రిథమ్ సర్ధుబాటు అవుతుంది. అందువల్ల మనం రాత్రి పూట తొందరగా మరియు ఏ టైం నిద్రపోవాలో ఆ టైంలోనే నిద్రపోతాము. దీనివల్ల మనం 7-8 గంటల వరకు నిద్రపోగలము. మనం ఉదయాన్నే లేవడం వల్ల మెదడు ప్రశాంతంగా, ఉత్తేజంగా ఉంటుంది.
అంతే కాదండోయ్, మనకు సరైన నిద్ర లేకపోతే అది వయస్సుతో పాటు చర్మం మరియు జుట్టు మీద ప్రభావం చూపిస్తుంది. చర్మం తొందరగా ముడతలు పడడం, మొటిమలు రావడం వంటివి జరుగుతుంటాయి. ఆరోగ్యకరమైన నిద్ర కలిగి ఉంటే దానివల్ల మెరుగైన జుట్టు మరియు చర్మ నిగారింపుని పొందవచ్చు.
ఉదయాన్నే లేస్తే సమయం మిగులుతుంది. దానివల్ల మన పనులు హడావిడిగా కాకుండా నిదానంగా చేసుకోవచ్చు. ఉదయం పూట ట్రాఫిక్ బాధ నుంచి కూడా తప్పించుకోవచ్చు.
కాబట్టి రాత్రి పూట తొందరగా నిద్రపోయి, తొందరగా మేల్కొవడానికి ప్రయత్నించండి.

