Home Page SliderInternationalNewsPolitics

‘గాజా మాదే’..ఇజ్రాయెల్ ప్రధాని

గాజాని ఇజ్రాయెల్ అధీనంలోకి తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. గాజా భూభాగాన్ని తమ సొంతం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. గాజాలో కరువుకి తమ మిత్రదేశాలు కూడా ఒప్పుకోకపోవడం వల్ల కొద్ది మొత్తంలో ఆహారం అందిస్తామన్నారు. ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు. ప్రస్తుతం తీవ్ర పోరాటం జరుగుతోందని పేర్కొన్నారు. అయితే గాజాలో ప్రజలు ఇజ్రాయెల్ దాడులతో పాటు ఆకలి కేకలతో కూడా చనిపోతున్నారని యునైటెడ్ నేషన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిన్న ఒక్కరోజులోనే 103 మంది ఇజ్రాయెల్ దాడులలో మృతి చెందారని సమాచారం. యుద్ధం శాశ్వతంగా ఆగాలంటే గాజా పాలన నుండి హమాస్ వైదొలగాలని, ఆయుధాలు అప్పగించాలని, ఉగ్రవాదులంతా ఇతర దేశాలకు వెళ్లిపోవాలని, గాజాను తమకు అప్పగించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. అయితే గాజా నుండి వెళ్లడానికి, ఆయుధాల అప్పగింతకు తాము సిద్ధంగా లేమని హమాస్ పేర్కొన్నట్లు సమాచారం.