NationalNews Alert

గంగవరం పోర్టు ఇక పూర్తిగా అదానీదే

అదానీ సంస్థ అన్ని రంగాలలో వ్యాపారంలో  వాయువేగంతో దూసుకుపోతోంది. తాజాగా గంగవరం పోర్టులో 58.1 శాతం వాటాను అదానీ పోర్ట్స్ అండ్ SEZ లిమిటెడ్‌కు DVS రాజు -ఆయన కుటుంబం నుంచి షేర్ల మార్పిడికి షేర్ స్వాప్ పద్దతిలో కొనుగోలు చేయడానికి అనుమతి లభించింది. దీనికి NCLT (జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్) అహ్మదాబాద్ బెంచ్, హైదరాబాద్ బెంచ్ అనుమతినిచ్చాయి. ఈ అవకాశంతో గంగవరం పోర్టుతో దేశంలో సరుకు రవాణా సేవల రంగంలో అత్యంత క్రియాశీలక పాత్రను అదానీ పోర్ట్స్ పోషించినట్లు అవుతోంది. గంగవరం పోర్టులో ఇంతకుముందే 31.5 శాతం వాటాను వార్‌వర్స్ పింకస్ నుంచి, 10.4 శాతం వాటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అదానీ పోర్టు కొనుగోలు చేసింది. ఇప్పుడు 58.1 శాతం కొనుగోలుతో నూటికి నూరుశాతం గంగవరం పోర్టు అదానీ గ్రూప్ పరమైంది. అదానీ పోర్ట్స్ సీఈఓ కరణ్ అదానీ ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. గంగవరం పోర్టు నూరుశాతం తమకు అనుబంధ సంస్థగా మారిందని తెలియజేశారు.