వైసీపీకి మనకు తేడా ఉండదు-చంద్రబాబు
వైసీపీ పార్టీ చేసిన తప్పులే మనం కూడా చేస్తే వారికి మనకు తేడా ఏమీ ఉండదు. ఎలాంటి తప్పులు చేయొద్దు అంటూ మంత్రులను హెచ్చరించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ప్రజల నుండి వినతుల స్వీకరణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని మంత్రులను సూచించారు. దీనికోసం ప్రత్యేక వ్యవస్థ, కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చేసామనే అలసత్వం ఉండకూడదు. రోజుకు ఇద్దరు మంత్రులు పార్టీ ఆఫీసులో ఉండి ప్రజల నుండి వినతులు స్వీకరించాలి అంటూ దిశానిర్ధేశం చేశారు. తెలుగుదేశం నేతలెవ్వరూ కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడవద్దని, అలా చేస్తే వారికి మనకు తేడా ఉండదు అంటూ హితవు చెప్పారు. మన కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల నుండి చట్టపరంగా వారికి విముక్తి కలిగిద్దాం అంటూ ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారు.