హుస్సేన్ సాగర్‌లో మొదలైన గణేష్ నిమజ్జనాలు
ఈ రోజుతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ చతుర్థి నుంచి ఈ నిమజ్జన విషయంలో ప్రభుత్వానికి గణేష్ ఉత్సవ కమిటీకి మధ్య పలు వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో గణేష్ నిమజ్జన కమిటీ నిన్నటి వరకు పలు రకాల ఆందోళనలు చేపట్టింది. అయితే ప్రభుత్వం మాత్రం నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్తోంది.

ఈ ఆందోళనల నడుమ ఎట్టకేలకు ఈ రోజు గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ గణేష్ నిమజ్జనానికి తెలంగాణా ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. దీని కోసం ట్యాంక్ బండ్‌పై ఇప్పటికే 15 క్రేన్లు ఏర్పాటు చేసింది తెలంగాణా సర్కార్. ఈ మేరకు ఈ రోజు హుస్సేన్ సాగర్‌లో అన్ని రకాల విగ్రహాల నిమజ్జనం చేయనున్నారు. ఈ నిమజ్జన సందర్భంగా జరిగే ఊరేగింపుల కోసం GHMC 168 గణేష్ యాక్షన్ టీమ్‌లను సిద్దం చేసింది. అంతే కాకుండా నిమజ్జనం వీధుల్లో 10 వేల మంది శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసింది.