NationalNews

రైల్వేలో వృద్ధులకు రాయితీ కొనసాగింపు

Share with

కరోనా సమయంలో  అనవసర ప్రయాణాలను అరికట్టడానికి ఎత్తేసిన రాయితీలలో రైల్వేలో చాలా రాయితీలు తిరిగి పునరుద్దరించలేదు. వాటిలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే 50 శాతం రాయితీ కూడా ఒకటి. ఎన్నాళ్లుగానో దీనిని పునరుద్ధరించాలనే డిమాండ్లు అధికమవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఈమధ్యనే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటులో ఈ రాయితీని పునరుద్ధరించడం లేదని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కరోనాకు పూర్వం 58ఏళ్లు దాటిన మహిళలకు 50 శాతం, 60 ఏళ్లు దాటిన పురుషులకు 40 శాతం ఈ రాయితీ లభించేది. అయితే నిరసనల నేపథ్యంలో రైల్వేశాఖ పునరాలోచనలో పడింది. కానీ పూర్తిగా కాదు. దీనిని 60 ఏళ్ల నుండి, 70కి పెంచే ఆలోచనలో ఉన్నట్లు, కేవలం ఈరాయితీని జనరల్, స్లీపర్ తరగతులకు మాత్రమే వర్తింపజేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కొవిడ్ తర్వాత రైల్వే ఆదాయం కూడా తగ్గిపోవడంతో పెంచుకునే ప్రయత్నంలో అన్ని రైళ్లలోనూ ప్రీమియం తత్కాల్ కోటాను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం 80 రైళ్లలో ఈ కోటా అమలవుతోంది. ఈ పద్దతిలో కొన్ని టిక్కెట్లను కేటాయిస్తారు. ఈధరలు తత్కాల్ కంటే అధికంగా ఉంటాయి. సీట్లు కేటాయింపులు అవుతుంటే టికెట్ల ధర పెరుగుతూ ఉంటుంది. చివరి నిముషంలో బుక్ చేసుకునే వారికి ధర చాలా అధికంగా ఉంటుంది.