రాజధానిని వీడని డెంగీ ఫివర్
రాజధాని నగరమైన హైదరబాద్‌లో భారీ వర్షాల కారణంగా దోమల బెడద రోజు రోజూకు పెరుగుతుంది. దోమల ఉత్త్ప త్తి ఎక్కువ అవడంతో డెంగీ విజృంభిస్తుంది. వీటి ఉత్త్పత్తిని నియంత్రించడంలో నగరపాలక సంస్ధ విఫలమైంది. దీనికి గల ముఖ్యకారణం దోమల నివారణకు కేటాయించిన నిధులలోని ఎక్కువ భాగం పక్కదారి పట్టడమే. గ్రేటర్ జిల్లాల పరిధిలో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. వీటి నివారణకు బల్దియా అధీనంలో పెద్ద యంత్రాంగమే ఉంది. దీని అధీనంలో రోజూ ఏదో ప్రాంతంలో ఫాగింగ్ జరగాల్సి ఉంది. కానీ నిధుల కొరత కారణంగా ఈ ఫాగింగ్ కూడా అనుకున్న విధంగా జరగడంలేదు. క్షేత్ర స్ధాయిలో దీనిపై పరిశోధనలు జరపగా కొద్ది కాలంగా కొన్ని కొన్ని ప్రాంతాలకు సరిగా ఫాగింగ్ జరగకుండానే ఆయా ప్రాంతాలకు రెండు గంటల పాటు ఫాగింగ్ జరిగిందని రికార్డుల్లో ఉంది. గతంలో మూసీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 200 మందిని, ఫాగింగ్ యంత్రాలను అద్దెకు తీసుకొని నది సమీపంలో రోజూ కొంత సమయం ఫాగింగ్ చేసేవారు. ఎడాది పాటు ఈ ఫాగింగ్ ప్రక్రియ చక్కగా జరిగింది. దీని ద్వారా దోమల ఉత్త్పత్తి చాలా వరకు నియంత్రణలో ఉంది. కానీ నిధుల కొరతతో మూసీ అభివృద్ధి సంస్ధ సిబ్బందిని తొలగించింది. దీని ఫలితంగా దోమల సంఖ్య తీవ్ర స్ధాయిలో పెరిగి డెంగీ కేసుల పెరుగుదలకు కారణమవుతోంది.
Read More: కేంద్ర నిర్ణయంతో దేశంలో ఉచితంగా బూస్టర్ డోస్ పంపిణీ