విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి
తమిళనాడు మాజీ సీం పళనిస్వామి ఇవాళ ఉదయం బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పళనిస్వామికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, అమ్మవారి ఆశీస్సుల కోసమే తాను విజయవాడ వచ్చానన్నారు పళనిస్వామి. ఈ సందర్భంగా రాజకీయాల గురించి మాట్లాడబోనన్నారు. ఎన్డీఏ నుంచి అన్నాడీఎంకే బయటకు రావడం గురించి ఇక్కడ కామెంట్ చేయనన్నారు.


