జపాన్ మాజీ ప్రధాని మృతి
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి చెందారు. దుండగడు రెండు రౌండ్లు కాల్పులు జరిపడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న షింజో అబేను గుర్తు తెలియని వ్యక్తి కాల్చడంతో తీవ్రంగా గాయపడ్డారు. షింజేను ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో ఆయన మృతి చెంది ఉంటారని అందరూ భావించారు. ఐతే వైద్యులు మాత్రం అబే కార్డియో పల్మనరీ అరెస్టు స్టేటస్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. జపాన్‌లో ప్రముఖుల మరణానికి ముందు ఇలాంటి ప్రకటన చేయడం సర్వసాధారణం.