సినిమా షూటింగ్స్ ఒకే రోజు ముగ్గురు నటులకు గాయాలు
సినిమా చిత్రీకరణల్లో భాగంగా జరిగిన వేర్వేరు ప్రమాదాలలో ముగ్గురు నటులు తీవ్రంగా గాయపడ్డారు. మార్క్ ఆంటోనీ అనే సినిమాలో నటిస్తున్న విశాల్ కొన్ని యాక్షన్ సీన్ల పాల్గొంటుండగా గాయాలపాలయ్యాడు. లొకేషన్ ప్రధమ చికిత్స చేసినా గాయం తగ్గక పోవడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల పాటు విశాల్ కు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. ఇటీవల లాఠీ అనే సినిమా షూటింగ్ జరుగుతుండగా కూడా విశాల్ గాయపడిన విషయం తెలిసిందే.
మరో ఘటనలో నటి టబూ కూడా గాయాల పాలయ్యారు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్‌లో ట్రక్కును బైక్స్‌తో ఛేజ్ చేసే సీన్ లో ప్రమాదం జరిగింది. టబూ కంటికి, నుదుటికి గాయాలయ్యాయి. దీంతో యూనిట్ సభ్యులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇంకో సంఘటనలో హీరోయిన్ శిల్పాశెట్టి గాయపడింది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరిగిపోయింది. ఈ ఘటనలు అటు బాలీవుడ్ ను ఇటు టాలీవుడ్ ను ఆందోళనకు గురి చేశాయి.