Andhra PradeshNews

పోలీసులు వస్తున్నారని… అక్కడ్నుంచి తప్పుకున్నా… (వీడియో)

Share with

తెలంగాణలో కోడి పందాల నిర్వహిస్తున్నట్టు విమర్శలు ఎదుర్కొంటున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అసలు విషయం చెప్పారు. తెలంగాణలో, కర్నాటక సరిహద్దుల్లో కోడిపందాల గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కర్నాటక వెళ్లింది నిజమేనని చింతమనేని చెప్పారు. కోడిపందాలంటే వ్యసనమన్నారు. వీక్ నెస్ ఉండబట్టే వెళ్లానన్నారు. అది ఘోరం కాదు.. నేరం కాదన్నారు… చట్టం దృష్టిలో నేరం కాబట్టి… నేరస్తుడిగా మిగలకూడదు కాబట్టి… పోలీసులు వస్తున్న విషయం తెలిసి తప్పుకున్నానన్నారు చింతమనేని ప్రభాకర్. తప్పుకున్నానని నేను అంటుంటే… పారిపోయానని అంటున్నారని చెప్పుకొచ్చారు. కారు, కోళ్లతో దెందులూరు సేఫ్ గా వచ్చేశానన్నారు.