పార్టీ మార్పుపై స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలోనే రైతులు సంతోషంగా ఉన్నారని, ఇప్పుడు రైతులు ఎంత ఆందోళనలో ఉన్నారో ఓసారి రేవంత్ రెడ్డి సమీక్షించుకోవాలని సూచించారు. కేసీఆర్ హయాంలో జరిగిన మంచిని మంచిగా చెప్పడం కొందరికి నచ్చడం లేదని సెటైర్లు వేశారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

