ఈనెలలో బ్యాంక్‌లకు మస్త్ సెలవులు
ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఆగస్టు నెలలో బ్యాంకులకు చాలా సెలవు రోజులు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా ముఖ్యమైన పండుగ రోజులు బాగా ఉండడంతో సెలవలు ఎక్కువగా ఉండబోతున్నాయి. మొహరం, రక్షాబంధన్, ఇండిపెండెన్స్ డే, జన్మాష్టమి, వినాయక చవితి,మొదలైన పండుగలతో పాటు స్వతంత్ర దినోత్సవం, 4 ఆదివారాలు, 2వ, 4వ శనివారాలు కలుపుకుంటే ఆంధ్ర, తెలంగాణాలకు 19 సెలవు రోజులు వస్తున్నాయి. సాధారణంగా బ్యాంకు సెలవలు రాష్ట్రానికీ, రాష్ట్రానికీ ఒకేలా ఉండవు. ఆయా ప్రదేశాల ప్రాధాన్యతను బట్టి రీజనల్ హాలిడేస్ కూడా ఉంటాయి. ఉదాహరణకి మొహరం పండుగ జమ్ము-కాశ్మీర్‌లో ఆగస్టు 8 అయితే ఇతర రాష్టాలలో 9న, అలాగే రక్షాబంధన్ గుజరాత్, మధ్యప్రదేశ్, సిమ్లాలలో ఆగస్టు 11 అయితే కాన్పూర్, లక్నోలలో ఆగస్టు 12న, ఇంఫాల్ స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 13 న జరగబోతోంది. ఇలాంటి తేడాల వలన ఏరాష్ట్రంలోనూ సెలవులు ఒకేలా ఉండవు.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబితాలోని కేలండర్ హాలిడేస్ అన్డర్ నెగోషబుల్ ఏక్ట్ ప్రకారం బ్యాంకులకు సెలవులు ఇవ్వబడతాయి. కాబట్టి మనం ఏదైనా బ్యాం కింగ్ లావాదేవీల విషయంగా సెలవులు గమనించి బ్యాంక్‌కు వెళ్లవలసి ఉంటుంది. అత్యవసర పని ఉన్నవారు ఇబ్బంది పడకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ సేవలను వినియోగించుకోవచ్చు.