వైసీపీలోకి కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ
ఏపీలోని కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్న జయ మంగళం వెంకటరమణ ఆ పార్టీకి సోమవారం షాక్ ఇచ్చారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి ఈరోజు ఉదయం సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఎమ్మెల్సీ హామీ సీఎం ఇవ్వటంతో ఆయన రెండు మూడు రోజుల్లో భారీ ఎత్తున కార్యకర్తలతో వైఎస్ఆర్సిపీ కండువా కప్పుకోబోతున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అవ్వబోతున్న ఏడు స్థానాల్లో ఒక స్థానాన్ని జయ మంగళం వెంకట రమణకు జగన్ ఇవ్వబోతున్నారు. మాజీ ఎమ్మెల్యేకి నలుగురు గన్ మ్యాన్లతో ఇప్పటికే ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసింది. వెంకటరమణ రాకతో కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలహీనపరిచి ఎక్కువ మెజార్టీ తో రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయాలని జగన్ వ్యూహమని విశ్లేషకులు అంటున్నారు.

