crimeHome Page SliderNationalPolitics

ఈడీ కేసులో మాజీ సీఎం కుమారుడు..

మద్యం కుంభకోణంలో జరిగిన మనీలాండరింగ్ కేసులో భాగంగా ఛత్తీస్‌గడ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసంలో సోమవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. నేడు జరిగిన ఈ సోదాలు 15 ప్రాంతాలలో జరగగా, వాటిలో భిలాయిలో ఉన్న చైతన్య భగేల్ నివాసం కూడా ఉంది. కానీ ఈ కేసుపై భగేల్ కార్యాలయం స్పందించింది. గతంలో ఏడేళ్లు నడిచిన ఈ తప్పుడు కేసును కోర్టు కొట్టివేసింది. కానీ ఇప్పుడు ఈడీ అధికారులు వచ్చి తనిఖీలు చేస్తున్నారని మండిపడింది. ఈ మద్యం కుంభకోణం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపణలు రావడంతో మద్యం సిండికేటుకు రూ.2 వేల కోట్ల లాభం చేకూరిందని ఈడీ ఆరోపించింది.