Breaking NewsHome Page SliderNational

ఫ‌ర్ ది ఫ‌స్ట్ టైం…రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌పై అవిశ్వాసం

స‌భాహ‌క్కుల‌ను రాల‌రాస్తున్నారంటూ రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌పై విప‌క్షాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. వాక్ స్వాతంత్య్ర హ‌క్కుని స‌భ సాక్షిగా మంట‌గొలుపుతున్నార‌ని మండిప‌డ్డాయి.కాంగ్రెస్ స‌హా ఇండియా కూట‌మి భాగ‌స్వామ‌మ్య ప‌క్షాలు,ఎన్టీయే వ్య‌తిరేక ప‌క్షాలంతా ఈ విష‌యంలో ఏక‌మ‌య్యి ఏకంగా రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ పైనే అవిశ్వాసం పెట్టాయి.లోక్ స‌భ ఛైర్మ‌న్‌పై ఎన్నో సార్లు అవిశ్వాసం పెట్టాయి .కానీ దేశ చ‌రిత్ర‌లో రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ పై అవిశ్వాస తీర్మానం పెట్ట‌డం ఇదే తొలిసారి. రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ జ‌గ్‌దీప్ ధ‌న్ క‌ర్‌పై అవిశ్వాసం పెట్టాలంటూ రాజ్య‌స‌భ కార్య‌ద‌ర్శికి నోటీసులిచ్చారు.ఈ నేప‌థ్యంలో అవిశ్వాసం పెడ‌తారా లేదా అని సందిగ్దంగా మారింది.