పాకిస్తాన్, ఆఫ్గాన్‌లలో భూకంపం.. ఢిల్లీ,యూపీలో కూడా ప్రకంపనలు
భూకంపం పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్‌లను వణికించింది. నేడు మధ్యాహ్నం పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్‌లలో భూమి కంపించిందని సమాచారం. భారత్‌లోని న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్ముకాశ్మీర్‌లలో కూడా భూప్రకంపనలు ఏర్పడ్డాయని నెటిజన్లు పేర్కొన్నారు. ఇది పాకిస్తాన్‌లో రిక్టర్ స్కేలుపై 5.8 మాగ్నిట్యూడ్‌గా నమోదయ్యింది. ఇది భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉండడం వల్ల భూకంపాలు తరచూ ఎదుర్కొంటోంది ఆ దేశం. 2005లో అత్యంత భయంకరమైన 7.4 మాగ్నిట్యూడ్‌తో ఏర్పడిన భూకంపం 74వేల మందిని బలితీసుకుంది.