ఐదుసార్లు ఎమ్మెల్యే.. అయినా దక్కని సీఎం దర్శనం
ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి సీఎం అపాయింట్‌మెంట్ దొరకట్లేదు. ఈ విషయం తెలంగాణలో సంచలనం కలిగిస్తోంది. కమ్యూనిస్టు నాయకుడు గుమ్మడి నర్సయ్య గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇల్లందు నియోజకవర్గానికి చెందిన ఆయన తమ ప్రాంత సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోసం గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారు. జూబ్లిహిల్స్‌లోని సీఎం నివాసం, సచివాలయం వద్ద వేచి ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రిని కలవాలని ఇప్పటికి నాలుగు సార్లు ప్రయత్నించానని, అధికారులకు ఫోన్లు చేస్తే రమ్మంటున్నారని, కానీ వచ్చాక సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పించడం లేదని మీడియాతో విచారం వ్యక్తం చేశారు.

