కశ్మీరు లోయలో కాల్పుల కలకలం
పచ్చటి కశ్మీరు లోయ మరోసారి కాల్పులతో దద్ధరిల్లింది. జమ్ముకశ్మీరులోని పహల్గామ్‌లో బైసరన్ లోయలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఒక వ్యక్తి చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన భార్య మాట్లాడుతూ తన కళ్లెదురుగానే తన భర్త తలకి రివాల్వర్ గురిపెట్టి షూట్ చేశారని విలపించింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న భద్రతా దళాలు ఆ ప్రదేశానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి.

