మాల్దీవుల్లో అగ్ని ప్రమాదం, 9 మంది భారతీయులు మృతి
మాల్దీవుల రాజధాని మాలేలో విదేశీ కార్మికుల ఇరుకైన లాడ్జింగ్‌లలో గురువారం మంటలు చెలరేగడంతో కనీసం 10 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు అగ్నిమాపక శాఖ పేర్కొంది. అత్యంత ప్రసిద్ధి చెందిన ద్వీపసమూహం రాజధాని ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటి.
గ్రౌండ్ ఫ్లోర్ వెహికల్ రిపేర్ గ్యారేజీ నుంచి వచ్చిన మంటల్లో ధ్వంసమైన భవనంపై అంతస్తు నుంచి 10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మంటలను ఆర్పడానికి తమకు నాలుగు గంటల సమయం పట్టిందని తెలిపారు. మృతుల్లో తొమ్మిది మంది భారతీయులు, ఒక బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు.

మాల్దీవుల్లోని భారత హైకమిషన్ ఈ ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపింది. మాలేలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో భారతీయ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారంది. మాల్దీవుల అధికారులతో మాట్లాడుతున్నట్టు అధికారులు చెప్పారు. విదేశీ కార్మికుల పరిస్థితిపై మాల్దీవుల ఓవైపు రచ్చుసాగుతోంది. రాజధాని మాలేలో ఉన్న రెండున్నర లక్షల మంది జనాభాలో సగం మంది బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకకు చెందినవారే. కోవిడ్-19 మహమ్మారి సమయంలో స్థానికులతో పోలిస్తే విదేశీ కార్మికులలో కరోనా వ్యాప్తి మూడు రెట్లు వేగంగా వ్యాపించినప్పుడు వారి దయనీయ జీవితాలు మీడియా కంట్లో పడ్డాయి.

