NewsTelangana

రేపట్నుంచి తెలుగు సినిమా షూటింగ్‌‌లు బంద్

Share with

రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు బంద్ చెయ్యాలని నిర్ణయించామన్నారు దిగ్గజ నిర్మాత దిల్ రాజు. సినిమా ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వచ్చేలా నిర్ణయాలుంటాయని చెప్పారు. ప్రస్తుతం 24 క్రాఫ్ట్స్‌లో అందరికీ ఇబ్బందులు ఉన్నాయన్నారు. అందరికీ న్యాయం చేయాలని చూస్తున్నామన్నారు.

తెలుగు ఇండస్ట్రీకి మేలు చేసేలా చాంబర్ నిర్ణయాలుంటాయని కొత్తగా తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన బసిరెడ్డి చెప్పారు. ఆగస్ట్ 2న ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రేపటి నుంచి సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. అందులో మరో నిర్ణయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇకపై తరచూ సమావేశాలు నిర్వహించుకొని… సమస్యలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నామన్నారు.

కోవిడ్ తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయని… టికెట్ రేట్లు భారీగా పెరగ్గా… ఓటీటీలు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, వేస్టేజ్ ఇలా అన్ని విషయాలపైనా నిర్మాతలు చర్చించాలన్నారు. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే చెబుతామన్నారు. ఉదయం జరిగిన ఫిల్మ్ చాంబర్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణపై బసిరెడ్డి 22 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 50 మంది ఈసీ సభ్యులుండగా… 42 మంది సభ్యులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.