సాయి ప్రియ గాలింపు కోసం రూ.కోటి ఖర్చు..
విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో మిస్ అయిన సాయిప్రియ మిస్సింగ్ మిస్టరి వీడింది.సాయి ప్రియ మిస్సింగ్ మిస్టరీని సవాలుగా తీసుకున్న వైజాగ్ పోలీసులు అహర్నిశలు శ్రమించి ఎట్టకేలకు సాయిప్రియ మిస్టరీని ఛేదించారు.ఈక్రమంలో మూడు రోజుల నుంచి సాయి ప్రియ కోసం దాదాపు జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమై గాలించింది.రెండు నేవి కోస్ట్ గార్డ్ షిప్ లతో పాటు ఓ హెలికాప్టర్ సాయంతో సాయిప్రియ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నేవీ అధికారులు, పోలీసులు, గజ ఈతగాళ్లు సైతం రంగలోకి దిగి తీవ్రంగా శ్రమించారు
సాయిప్రియ సముద్రంలో గల్లంతయిందేమోనని నేవీ హెలికాప్టర్ లతో 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఇందుకోసం అధికారులు కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. హెలికాప్టర్లను సముద్రంపై తిప్పుతూ ఆమె కోసం గాలించారు .హెలికాప్టర్లు తిప్పేందుకు రూ.లక్షల్లో ఇంధనం ఖర్చయింది. సాయిప్రియ తన ప్రియుడు రవితో నెల్లూరు వెళ్లిపోవడం.. ఆమె సముద్రంలో గల్లంతైందని ఎంతో మంది అధికారులను పరుగులు పెట్టించడమే కాక, కుటుంబ సభ్యులను కూడా ఆందోళనకు గురిచేసింది.
ఈ విషయమై విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ మాట్లాడుతూ.. సాయిప్రియ ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ప్రస్తుతం సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని, ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.