Home Page SliderNational

15 కిలోల బంగారంతో దొరికిన సినీ నటి..

15 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ నిన్న బెంగళూరు ఎయిర్‌పోర్టులో సినీ నటి రాన్యా పట్టుబడింది. దుబాయ్ నుంచి ఇటీవల గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో పెట్టుకొని రాన్యా రావు తీసుకొచ్చింది. రాన్యా రావు తెచ్చిన బంగారం విలువ రూ.12 కోట్లు ఉంటుందని కస్టమ్ అధికారులు వెల్లడించారు. తండ్రి రామచంద్రరావు పోలీస్ ఉన్నతాధికారి కావడంతో కస్టమ్స్ దగ్గర తనిఖీలు జరగకుండా రాన్యా జాగ్రత్త పడింది. ఆమెకు ఎయిర్‌పోర్టులో ఎవరైనా సాయం చేస్తున్నారా అన్న కోణంలో DRI అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రాన్యాను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆర్థిక నేరాల కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆమె 15 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు దుబాయ్ కు వెళ్తూ వస్తూ ఉండటంతో అధికారులు ఆమెపై నిఘా పెట్టారు. ఈ నిఘాలోనే బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది.