News

ఇండియా కోసం పోరాడుతున్నా.. అనర్హతపై రాహుల్ స్పందన

పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు. దేనికైనా తాను సిద్ధమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని అవమానించేలా చేసిన వ్యాఖ్యకు పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష తర్వాత, లోక్ సభ సెక్రటేరియట్ ఆయనను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించింది. “భారతదేశం వాయిస్ కోసం నేను పోరాడుతున్నాను. ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నాను” అంటూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు.