Home Page SliderInternational

భారతీయ విద్యార్థిని కోసం FBI గాలింపు చర్యలు..

అమెరికాలో నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన మయూషీ భగత్ (29) అనే భారతీయ విద్యార్థిని కోసం FBI గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. గతేడాది జులైలో ఈమెను మిస్సింగ్ లిస్ట్‌లో చేర్చిన అధికారులు.. తాజాగా ఆమె ఆచూకీపై రివార్డు ప్రకటించారు. మయూషీ ఆచూకీ చెప్పిన వారికి $10 వేల డాలర్ల (రూ.8.32 లక్షలు బహుమానం అందిస్తామని తెలిపారు. 2016లో US వచ్చిన భగత్.. 2019 ఏప్రిల్ 29న కనిపించకుండా పోయారు.