NationalNews Alert

కూతురిపై ప్రేమతో తండ్రి చేసిన పని తెలిస్తే షాకవుతారు

ఆడపిల్లలు వద్దు అనుకొనే రోజులు పోయి, అదృష్టదేవతలుగా భావించే రోజులొచ్చాయి. చాలామంది అబ్బాయిల తల్లిదండ్రులకు వారి కుమారులకు పెళ్లిళ్లకు అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీనితో ఆమ్మాయి పుడితే చాలా ఆనందంగా, అదృష్టంగా చూసుకుంటున్నారు. తాజాగా ఓ వీడియో చాలా వైరల్ అయ్యింది. జార్ఖండ్‌లోని డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న IAS అధికారి సంజయ్ కుమార్ TWITTERలో ఈ వీడియోను షేర్ చేసారు. దీనిలో తల్లిదండ్రులు తమ కుమార్తెకు వీడ్కోలు చెపుతూ ఆమె పాదముద్రలను ఇంట్లో భద్రపరుస్తున్నారని టైటిల్ పెట్టారు. ఆవీడియోలో ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఆమె కాళ్లను పళ్లెంలో ఉంచి, నీటితోనూ, పాలతోనూ కడుగుతారు. తర్వాత ఆపాలను , వారు సేవిస్తారు. తర్వాత ఎరుపురంగు నీళ్లలో ఆమె పాదాలను ఉంచి, తెల్లటి వస్త్రంపై ఆమె పాదముద్రలు పడేలా చేస్తారు. అయితే ఈ వీడియో ఎక్కడిదో, వారు ఎవరో తెలియదు. కానీ ఆ తల్లిదండ్రులు చేసిన పని చాలామందిని కదిలించింది. ఆడపిల్లను బాగా ఆదరిస్తున్నారంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.