Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

గుంటూరు జిల్లాలో ఘోర‌ రోడ్డు ప్రమాదం జ‌రిగింది.మిర్చి కూలీల‌తో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్ట‌డంతో ముగ్గురు మహిళలు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. నారాకోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు నాచార‌మ్మ‌,సీతారావ‌మ్మ‌,అరుణ‌లు చేబ్రోలు మండ‌లం సుద్దపల్లికి చెందిన వారిగా గుర్తించారు.మ‌రో ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.ఇందులో కొంత మంది పరిస్థితి విష‌మంగా ఉంది. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ట్రాఫిక్‌ని క్ర‌మ‌బ‌ద్దీక‌రించారు.మృత‌దేహాల‌ను పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. క్ష‌త‌గాత్రుల‌ను మెరుగైన చికిత్స నిమిత్తం జిజిహెచ్‌కి త‌ర‌లించారు.