కశ్మీర్‌లో కాల్పులపై ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
కశ్మీర్‌లో పాక్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే అని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎప్పుడూ పాకిస్తాన్‌లో భాగం కాదని స్పష్టం చేశారు. జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పాక్ ఇప్పటికైనా ఆపేయాలని హితవు చెప్పారు. భారత్ హెచ్చరికలను పాక్ పట్టించుకోక పోతే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఫరూక్ అబ్దుల్లా పాక్‌ను హెచ్చరించారు. గాందర్‌బల్ జిల్లాలోని గుండ్ వద్ద శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారి వద్ద కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక వైద్యుడు, ఆరుగురు కార్మికులు మృతి చెందారు.

