Home Page SliderPoliticsTelangana

కేసీఆర్‌ డైరక్షన్‌లో ఫౌంహౌస్‌ ఫైల్స్‌ అట్టర్‌ ప్లాప్‌

సీఎం కేసీఆర్‌ డైరక్షన్‌లో రూపొందించిన ఫాంహౌస్‌ ఫైల్స్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కథ, స్ర్కీన్‌ ప్లే ఫెయిల్‌ అయిందన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌ రెడ్డి మాట్లాడారు. అబద్ధాలు, గారడీ చేయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఫాంహౌస్‌ కేసులో కోర్టు తీర్పు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చెంపపెట్టులాందన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫోన్ల డేటాను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఫాంహౌస్‌ ఘటన అనంతరం నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌లో ఎందుకు బంధించారని కిషన్‌ రెడ్డి నిలదీశారు. బురదలో నుంచే కమలం పువ్వు వికసిస్తుందని.. కానీ కమలానికి ఎలాంటి బురద అంటదన్నారు. తెలంగాణ పేరును దేశ వ్యాప్తంగా నవ్వులపాలు చేస్తున్నారని కిషన్‌ రెడ్డి మండిపడ్డారు.