Home Page SliderTelangana

ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఫేక్ ఐడీల కలకలం

ఐపీఎల్ మ్యాచ్‌లు చూడడానికి క్రికెట్ ప్రియులు ఎగబడుతున్నారు. ఉప్పల్‌లో ఏప్రిల్ 18న జరిగిన సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో పదిమంది ఫేక్ ఐడీలు గలవారిని గుర్తించారు. వేరే వ్యక్తులకు కేటాయించిన సీట్లలో ఈవ్యక్తులు కూర్చున్నట్లు తెలిసింది. నకిలీ ఎక్రిడేషన్‌తో స్టేడియంలోకి ప్రవేశించారు ఫేక్ రాయుళ్లు. దీనితో అసలు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్నటి మ్యాచ్‌లో కూడా ఫేక్ ఐడీలతో ప్రవేశించిన వారిని గుర్తించారు. ఈ సంస్థ వెండర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.